మొలకెత్తిన పెసర్లు: ఒక కప్పు, ఉప్మా రవ్వ: అరకప్పు, పెరుగు: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా
మిక్సీ జార్లో పెసర మొలకలు, రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనెరాసి మిశ్రమాన్ని ఇడ్లీలు వేసుకోవాలి. మామూలు ఇడ్లీల్లానే వీటినీ పదిహేను నిమిషాలపాటు ఆవిరిపై ఉడికించుకుంటే ఆరోగ్యకరమైన మొలకల ఇడ్లీ సిద్ధం. వీటిని చట్నీతోనూ, సాంబార్తోనూ తినవచ్చు.
Chinese Paratha Recipe | చైనీస్ పరోటా తయారీ విధానం”