Chinese Paratha Recipe | చైనీస్ పరోటా తయారీ విధానం
Chinese Paratha Recipe | చైనీస్ పరోటా తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి: ఒక కప్పు, ఆలుగడ్డ: ఒకటి (పెద్దది), క్యాబేజీ, క్యారెట్ తురుము: పావు కప్పు చొప్పున, ఉల్లిగడ్డ: ఒకటి, అల్లం, వెల్లుల్లి తరుగు: అర టీస్పూన్ చొప్పున, పచ్చిమిర్చి: ఒకటి, తెల్ల మిరియాల పొడి: అర టీస్పూన్, డార్క్ సోయా సాస్: ఒక టీస్పూన్, చైనీస్ రెడ్‌చిల్లీ పేస్ట్ (సెజువాన్ చట్నీ): ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, వెనిగర్/నిమ్మరసం: ఒక టీస్పూన్, గ్రీన్‌చిల్లీ సాస్: ఒక టీస్పూన్, నూనె: పావు కప్పు.
Chinese Paratha Recipe | చైనీస్ పరోటా తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి తగినన్ని నీళ్లుపోసి ముద్దలా కలిపి మూతపెట్టి అరగంటపాటు పక్కనపెట్టాలి. ఆలుగడ్డను ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి.. వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అన్నీ దోరగా వేగాక క్యాబేజీ తురుము వేయాలి. రెండు నిమిషాలు వేగాక క్యారెట్ తురుము కూడా జోడించాలి. సోయా సాస్, చిల్లీ సాస్, చైనీస్ చిల్లీపేస్ట్, మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, ఉప్పు, వెనిగర్, ఉడికించిన ఆలుగడ్డ కూడా వేసి బాగా కలపాలి. చివరగా ఉల్లికాడల తురుము వేసి దించి చల్లారనివ్వాలి. పిండిని పూరీల్లా ఒత్తి మధ్యలో కూర మిశ్రమం పెట్టి అంచులు ముడిచి ఒత్తుకోవాలి. స్టవ్‌మీద పెనం పెట్టి వేడయ్యాక పరోటాలను వేసి రెండువైపులా నూనెవేస్తూ కాల్చుకుంటే వేడివేడి చైనీస్ పరోటా సిద్ధం.
Read More :
Lavanga Lathika Recipe | లవంగ లతిక తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

