ఇడ్లీలు: నాలుగు, పెరుగు: ఒక కప్పు, నూనె: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర, ఆవా లు: అర టీస్పూన్ చొప్పున, ఇంగువ: చిటికెడు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి: ఒక్కటి చొప్పున, కరివేపాకు: ఒక రెబ్బ, దానిమ్మ గింజలు: ఒక టేబుల్ స్పూన్, చక్కెర: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత
ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, చక్కెర వేసి నీళ్లు పోయకుండా బాగా గిలక్కొట్టాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనెవేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఇడ్లీలను ఒక గిన్నెలో వేసి పైనుంచి గిలక్కొట్టిన పెరుగు పోసి దాని పైనుంచి వేయించిన పోపు వేసి దానిమ్మ గింజలు చల్లుకుంటే నోరూరించే పెరుగు ఇడ్లీ సిద్ధం.
30 ఏళ్ల నుంచి రూ.2.50 కు ఇడ్లీ, రూ.5 కు దోశ అమ్ముతున్న మహిళ.. కారణం ఏంటో తెలుసా?”
Banana flower Vada Recipe | అరటిపువ్వు వడ తయారీ విధానం”
Keera Dosa Recipe | కీరా దోశ తయారీ విధానం”
Bread Manchurian Recipe బ్రెడ్ మంచూరియా తయారీ విధానం”