గుడ్లు: మూడు, చక్కెర: ఒక కప్పు, చాక్లెట్ చిప్స్: ఒక టేబుల్ స్పూన్, బిస్కెట్స్: నాలుగు.
స్టవ్‌మీద పాన్ పెట్టి ముప్పావు కప్పు చక్కెర వేసి నీళ్లు పోయకుండా సన్నని మంటపై ఉడికించి క్యారమెల్ తయారు చెయ్యాలి. ఒక గిన్నెలో గుడ్లలోని తెల్లసొన మాత్రమే తీసుకొని దాంట్లో మిగతా చక్కెర వేసి బీటర్‌తో చిక్కటి పేస్ట్‌లా అయ్యేంతవరకూ బీట్ చెయ్యాలి. ఒక గిన్నెలో క్యారమెల్ వేసి చుట్టూ పరుచుకునేలా తిప్పి.. చల్లారాక గుడ్ల మిశ్రమం వేసి పది నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో బోర్లించి పైనుంచి చాక్లెట్ చిప్స్, బిస్కెట్స్ తురిమి వేస్తే నోరూరించే స్నో పుడ్డింగ్ సిద్ధం.
Ragi Murukku Recipe | రాగి మురుకులు తయారీ విధానం”