బ్రెడ్ ముక్కలు: నాలుగు, గుడ్లు: రెండు, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), టమాట: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, మష్రూమ్స్: రెండు, మిరియాల పొడి: చిటికెడు, ఉప్పు: తగినంత, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు.
ఒక గిన్నెలో గుడ్లు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాట, ఉల్లిగడ్డ, మష్రూమ్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. క్యాప్సికమ్ చివర్లు కోసి, మధ్య భాగాన్ని గుండ్రని ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి కొద్దిగా వెన్న వేసి బ్రెడ్ ైస్లెసులను రెండు వైపులా కాల్చి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో ఇంకొంత వెన్న వేసి క్యాప్సికమ్ ైస్లెసులు పెట్టి మధ్యలో గుడ్డు మిశ్రమం వేసి మెల్లగా తిప్పి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ైైస్లెస్లకు వెన్న రాసి, పైనుంచి క్యాప్సికమ్ ైస్లెస్ పెట్టి మళ్లీ పైనుంచి బ్రెడ్ ైస్లెస్ పెడుతూ అన్నిటినీ పేర్చుకుంటే లేయర్డ్ బ్రెడ్ శాండ్విచ్ సిద్ధం. ఆ మిశ్రమంలో చీజ్ తురుము కూడా జతచేసుకోవచ్చు.
“Egg Kheema Masala Recipe | ఎగ్ ఖీమా మసాలా ఎలా చెయ్యాలి?”