Gautam Gambhir : ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనుంది. ఆదివారం తిరువనంతపురంలో తొలి మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్ మొదలవ్వనుంది. వరల్డ్‌కప్‌లో టీమిండియా కాంబినేషన్ల కూర్పు కోసం ఇదే సరైన సమయం. దాంతో.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్‌స్టార్ ఇంటర్వ్యూలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి చెబుతూ.. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో వారిద్దరూ జట్టుకు చాలా ముఖ్యం అన్నాడు గౌతీ.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచక స్క్వాడ్‌లో ఉండేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది. సీనియర్లు, జూనియర్లతో పటిష్టమైన బృందం ఎంపిక ప్రక్రియను భారత కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కసరత్తు ఆరంభించారు. ప్రస్తుతం సన్నాహక సిరీస్‌లపై దృష్టి సారించిన టీమిండియా.. స్వదేశంలో విండీస్‌ను ఢీకొడుతోంది. ఆదివారం తొలి వన్డే జరుగున్నందున హెడ్‌కోచ్ గంభీర్ జియో హాట్‌స్టార్ ఇంటర్వ్యూలో సీనియర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఓపెనర్ సంజూ శాంసన్‌పై వేటు వేయడం తన కోచింగ్ కెరీర్లో తీసుకున్న కఠిన నిర్ణయమని గౌతీ అన్నాడు.
“Whether it’s Hardik, whether it’s Jasprit Bumrah, they are going to be extremely important for us in [the ODI World Cup in] Africa”
Gautam Gambhir says India would need to balance game-time and workload for key players like Hardik Pandya and Jasprit Bumrah… pic.twitter.com/t0QaSSpxYu
— Cricinfo (@cricinfo) September 25, 2026
‘వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి సగం ఫిట్నెస్తో వెళ్లలేం. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు దక్షిణాఫ్రికాలో భారత జట్టుకు చాలా కీలకం. చాలా కొన్ని జట్లకు మాత్రమే హార్దిక్ లాంటి ఆటగాడు ఉన్నాడు. అతడు పది ఓవర్లు బౌలింగ్ చేయగలడు. అలానే 6, 7వ స్థానాల్లో విలువైన పరుగులు చేస్తాడు. అందుకని మా ఫోకస్ అంతా అతడిమీదే. అయితే.. మెగా టోర్నీకి ముందు అతడు మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. ఐపీఎల్ 19వ సీజన్ తర్వాత పాండ్యా పెద్దగా క్రికెట్ ఆడలే. వన్డేల విషయంలో.. అతడిని తీసుకోవాల్సి వస్తే.. కచ్చితంగా సన్నద్ధత సరిపోదు. పాండ్యా టీ20లు ఆడేసి.. వన్డేల్లోకి వస్తాడు. కానీ, వరల్డ్‌కప్ ముందు సరిపోను గేమ్ టైమ్ ఉండడం చాలా చాలా ముఖ్యం.

బుమ్రా విషయానికొస్తే.. అతడిని ఎన్ని వన్డేలు ఆడిస్తామనేది కీలకం. అదే సమయంలో టెస్టు క్రికెట్టూ ముఖ్యమే. కాబట్టి బుమ్రాను ఆడించడం, అతడిపై పని భారం పడకుండా చూసుకోవడం ప్రధానమే అని గంభీర్ వెల్లడించాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో సంజూ శాంసన్‌ను తప్పించడం నిజంగా బాధేసింది. టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచిన ఆటగాడిని.. ఆ తర్వాతి మూడు నాలుగు మ్యాచ్‌లకే బెంచ్‌పై కూర్చోబెట్టిన రోజు నేను నిద్రపోలేదు. చెప్పాలంటే నా టీ20 కోచింగ్ కెరీర్లో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇదే అని గంభీర్ పేర్కొన్నాడు.
ఐర్లాండ్‌లో విఫలమైన సంజూను కాదని వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే నిర్ణయంపై కూడా గంభీర్ మాట్లాడాడు. ప్రతిభావంతుడైన వైభవ్‌ను ఆడించడం సబబే. కానీ కొన్నిసార్లు బాగా ఆడిన వాళ్లు కూడా అవకావం కోసం ఎదురుచూడాల్సిందే. అదే సమయంలో.. మీడియాలో వచ్చే వదంతలను బట్టి.. తుది జట్టును ఎంపిక చేయం. స్క్వాడ్‌లో ఉన్నవారిలో ఎవరు మ్యాచ్‌ను గెలిపించగలరు? అనే దానిని బట్టి పదకొండు మందిని ఎంపిక చేస్తాం అని హెడ్‌కోచ్ వివరించాడు.