సర్వసభ్య సమావేశంలో మహిళా సర్పంచ్ కన్నీళ్లు
గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాంపల్లి ఎంపీడీవో రామకృష్ణ శర్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో...
నాంపల్లి, సెప్టెంబర్ 25 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాంపల్లి ఎంపీడీవో రామకృష్ణ శర్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు విద్యుత్, వైద్య, త్రాగునీరు, రోడ్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సర్పంచులు మాట్లాడుతూ ఎన్నికైన దగ్గర నుండి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. చేయూత పెన్షన్లు 700 దరఖాస్తులు వచ్చాయని వాటిని ఐదుగురు గెజిటెడ్ అధికారులు వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారని త్వరలో జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు తెలిపారు. వచ్చేనెల 2 నుండి విబి జి రామ్ జీ ప్రణాళిక సర్పంచులు పకడ్బందీగా నిర్వహించుకుని గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఆంజనేయులు, సిడిపిఓ సక్కుబాయి, సర్పంచులు కడారి శ్రీశైలం యాదవ్, ఏరెడ్ల నారాయణరెడ్డి, వెంకట్ రెడ్డి, ఏసు, సాగర్ల యాదయ్య, ఇరిగి రాణీ, కోరే దేవేంద్ర, గోవర్ధన్, బత్తుల వంశీ, రాజేంద్రర్, మట్టిపెళ్లి మణిమాల పాల్గొన్నారు.
తిరుమలగిరి గ్రామ మహిళా సర్పంచ్ కన్నీళ్లు
మండల సర్వసభ్య సమావేశంలో తిరుమలగిరి గ్రామ సర్పంచ్ ఇరిగి రాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. సంవత్సరం నుండి తమ గ్రామానికి మిషన్ భగీరథ మంచినీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో తమ గ్రామ ప్రజలు తనను నువ్వేం సర్పంచ్వి అని నానా బూతులతో తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికైన దగ్గర నుండి సమస్యను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా వారు స్పందించడం లేదంటూ సర్వసభ సమావేశంలో ఏడ్చేసింది. పండుగ పూట కూడా గ్రామస్తుల తిట్లకు తిండి తిప్పలు లేకుండా ఉన్నట్లు పేర్కొంది. గ్రామంలో మంచినీరు ఇస్తే తనకు పేరు వస్తుందని, దీంతో ఎవరైనా తమకు నీళ్లు రాకుండా చేయాలని చెప్పారా అని అధికారులను ఆమె నిలదీశారు.

సర్వసభ్య సమావేశంలో మహిళా సర్పంచ్ కన్నీళ్లు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

