అర్వపల్లి పీహెచ్సీలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం
అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వయో వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వయో వృద్ధులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య స్క్రీనింగ్, వైద్యుల సంప్రదింపులు...
అర్వపల్లి, సెప్టెంబర్ 25 : అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వయో వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వయో వృద్ధులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య స్క్రీనింగ్, వైద్యుల సంప్రదింపులు అలాగే అవసరమైన మందులు అందజేశారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, పోషకాహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అసాంక్రమిక వ్యాధుల (NCDs) నివారణ, నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా.నగేష్ నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చు నాయక్, సూపర్వైజర్ వి.లలిత, నర్సింగ్ ఆఫీసర్ ఎం.మాధవి, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

