Garlic Mushroom Fried Rice Recipe | గార్లిక్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
Garlic Mushroom Fried Rice Recipe | బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంటపాటు నానబెట్టి కొద్దిగా ఉప్పు, నూనె వేసిన నీళ్లలో ఉడికించి, ఆ నీళ్లు వంపేయాలి.
Garlic Mushroom Fried Rice Recipe | గార్లిక్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం: ఒక కప్పు, తరిగిన మష్రూమ్స్: అర కప్పు, ఆలివ్ ఆయిల్: అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు: పది, తురిమిన అల్లం, వెల్లుల్లి: ఒక టీస్పూన్ చొప్పున, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, తురిమిన క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, సోయాసాస్, వెనిగర్: ఒక టీస్పూన్ చొప్పున, రెడ్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, తరిగిన స్ప్రింగ్ ఆనియన్: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత.
Garlic Mushroom Fried Rice Recipe | గార్లిక్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంటపాటు నానబెట్టి కొద్దిగా ఉప్పు, నూనె వేసిన నీళ్లలో ఉడికించి, ఆ నీళ్లు వంపేయాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మష్రూమ్స్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో మరో టేబుల్‌స్పూన్ నూనె వేసి, నిలువుగా కత్తిరించిన వెల్లుల్లి రెబ్బల్ని దోరగా వేయించి పక్కన పెట్టాలి. మిగతా నూనె వేసి.. వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు జోడించాలి. అన్నీ వేగాక క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ తరుగు వేసి రెండు నిమిషాలు సన్నని మంటపై వేయించాలి. సోయా సాస్, వెనిగర్, షెజ్వాన్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు కలగలిపి.. ఉడికించి పెట్టుకున్న అన్నం, వేయించిన మష్రూమ్స్, వెల్లుల్లి రెబ్బలు కలిపేయాలి. పైనుంచి స్ప్రింగ్ ఆనియన్ చల్లుకుంటే వేడివేడి మష్రూమ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ సిద్ధం.
Read More Recipes :
Mushroom Hummus Recipe | మష్రూమ్ హుమ్మస్ తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

