బొంబాయి రవ్వ: ఒక కప్పు, మైదాపిండి: రెండు కప్పులు, నెయ్యి: ఒక కప్పు, చక్కెర: రెండు కప్పులు, యాలకుల పొడి: అర టీస్పూన్, బేకింగ్ పౌడర్: రెండు టీస్పూన్లు, బేకింగ్ సోడా: అర టీస్పూన్, పాలు: ఒక కప్పు.
మిక్సీ జార్లో చక్కెర వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక గిన్నెలో నెయ్యి, చక్కెర పొడి వేసి మృదువుగా మారేంతవరకు కలపాలి. రవ్వ, మైదా కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో బేకింగ్ పౌడర్, వంటసోడా, యాలకుల పొడి వేసి కొద్దికొద్దిగా పాలు పోస్తూ చపాతీ ముద్దలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. బాగా నానిన పిండిని కొద్దికొద్దిగా తీసుకుని గుండ్రని ముద్దల్లా చేసి అరచేతిలో పెట్టి కొద్దిగా ఒత్తుకోవాలి. ఓవెన్‌ను 180 డిగ్రీల వద్ద 20 నిమిషాలు ప్రీ హీట్ చేయాలి. బిస్కెట్లను నూనె రాసిన ట్రేలో పెట్టి 15 నిమిషాలపాటు బేక్ చేసుకుంటే కరకరలాడే రవ్వ బిస్కెట్లు సిద్ధం.
Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం
Noodles Momos Recipe | నూడుల్స్ మోమోస్ తయారీ విధానం
Mango Falooda Recipe | మ్యాంగో ఫాలూదా తయారీ విధానం
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీ విధానం