కొత్తగా కమిటీల పేరుతో కాలక్షేపం వద్దు.. ప్రభుత్వ తీరుపై దేవీప్రసాద్ ఆగ్రహం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిషారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మోసపూరిత కాలయాపన చేస్తున్నదని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ సోమవారం ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిషారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మోసపూరిత కాలయాపన చేస్తున్నదని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ సోమవారం ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 21 నాటికి సమస్యలను కొలికి తెస్తామని గతంలో స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ ‘సీఎం దృష్టికి తీసుకెళ్తాం’ అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించడం కాలయాపనలో భాగమేన ని మండిపడ్డారు. పీ ఆర్సీ, కరువు భత్యం అత్యంత కీలకమైన ఆర్థిక ప్రయోజనాల విషయం లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆక్షేపించారు. పీఆర్సీ నివేదిక 15 నాటికే వస్తుందని చెప్పి, నెలాఖరు వరకు వాయిదా వేయడం వెనుక ప్రభుత్వ చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు.
కరెంటు కోతలపై రైతుల రాస్తారోకో
దామరచర్ల, సెప్టెంబర్ 21: కరెంటు కోతలతో వేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రం పరిధిలో పది రోజుల నుంచి కరెంటు సక్రమంగా రాకపోవడంతో నాలుగురోజుల క్రితం దామరచర్ల సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. సమస్యను పరిష్కరిస్తామని అధికార్లు తెలిపి వారం దాటినా కరెంటు సమస్య తీరకపోవడంతో సోమవారం మండల కేంద్రంలోని ప్రధానరహదారిపై మరోసారి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కరెంట్ సక్రమంగా సరఫరా చేస్తామని అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టంచేశారు. వాడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

