సామాన్యుడికిధరాఘాతం.. ఘాటెక్కిన ఉల్లి, చేదెక్కిన చక్కెర
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. గత మూడు నెలల వ్యవధిలో ఉల్లి రేటు భారీగా పెరిగింది. పండుగ సీజన్ ముందర చక్కెర ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. నూనె, పప్పుల ధరలు మంటెక్కిస్తున్నాయి. పెట్రోల్, గ్యాస్ ధరల సెగ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
- నూనెలు సలసల.. ఉడకని పప్పులు
- పెట్రోల్ మంట.. గ్యాస్‌తో తంటా
- ఎల్‌నినోతో మున్ముందు సంక్షోభం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 : రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. గత మూడు నెలల వ్యవధిలో ఉల్లి రేటు భారీగా పెరిగింది. పండుగ సీజన్ ముందర చక్కెర ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. నూనె, పప్పుల ధరలు మంటెక్కిస్తున్నాయి. పెట్రోల్, గ్యాస్ ధరల సెగ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు వంట గ్యాస్ ధర సిలిండర్‌కు సుమారు 89 రూపాయలకు పైగా పెరిగింది. పెట్రోల్ లీటర్ ధర అయితే రూ.100 ఎప్పుడో దాటేసింది. దీంతో ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు అని సామాన్యుడు నిట్టూరుస్తున్నాడు.
ఉల్లి పేరెత్తితేనే కంట నీరు
సామాన్యుడి దగ్గర నుంచి కుబేరుడి వరకు ప్రతి ఒక్కరి వంటలో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లి రేటు ఇటీవల కన్నీరు తెప్పిస్తున్నది. కేవలం మూడు నెలల వ్యవధిలో దీని రేటు రెట్టింపు కావడంతో దానిని కొనలేక, కొనకుండా ఉండలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాని పేరెత్తితేనే సామాన్యుడి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రభుత్వ డాటా ప్రకారం జూన్ 1 నాటికి ఉల్లిగడ్డలు కిలో ధర రూ.29.50 ఉండగా, సెప్టెంబర్ 17 నాటికి అది రూ.53.78కు పెరిగింది. అంటే మూడు నెలల కాలంలో 82.3 శాతం ధర పెరిగింది. మహారాష్ట్రలో వేసవి ఉల్లి పంట దెబ్బతినడంతో మార్కెట్‌కు తక్కువ పరిమాణంలో రావడంతో ధరలు కొండెక్కాయి. అలాగే కర్ణాటక నుంచి కూడా ఉల్లి సరఫరా తగ్గిపోయింది. ఖరీఫ్ పంట మార్కెట్‌కు ఆలస్యంగా రావడం ధరలపై ఒత్తిడిని పెంచింది.
ఘాటెక్కిన మసాలాలు.. ఉడకని పప్పులు
నెల రోజుల్లో మసాలాల ధరలు 10 నుంచి 25 శాతం పెరిగాయి. పచ్చ యాలకులు కిలో ధర రూ.4 వేల నుంచి 4,400కు, నల్ల యాలకులు రూ.2,400 నుంచి 2.800కు, జీలకర్ర రూ.360 నుంచి రూ.400కు, జాపత్రి కిలో రూ.2,500 నుంచి 3,000కు పెరిగాయి. కందిపప్పు కిలో రూ.100 నుంచి 130, శనగపప్పు రూ.70 నుంచి 100, మినపప్పు రూ.120 నుంచి 140, ఆవనూనె రూ.190 నుంచి 210, సఫోలా ఆయిల్ రూ.240 నుంచి 280కు ఎగబాకాయి.
మోదీ మీ అచ్ఛేదిన్ ఎక్కడ?
రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడు గిలగిల్లాడుతుంటే ప్రధాని మాత్రం అచ్ఛేదిన్ అంటూ ప్రకటనలు చేస్తున్నారని, మోదీ మీ అచ్ఛేదిన్ ఎక్కడ? అని పౌరులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. మరో పక్క యూపీఐపై చార్జీలు విధించి సామాన్యుడిని తిప్పలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు.
రబీపై ఎల్ నినో దెబ్బ
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు త్వరలోనే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎల్ నినో పరిస్థితులు వచ్చే రబీ సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల తగ్గుదల రాష్ట్రంలో తీవ్ర ఆహార కొరతను సృష్టించే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నీటినిల్వలు లేకపోవడంతో ప్రధాన పంట వరితో పాటు, కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో టమాట, పచ్చిమిర్చి, ఉల్లి, బెండకాయ తదితర కూరగాయలు వినియోగదారులకు అందుబాటులో లేని పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. ఎల్ నినో ప్రభావంతో ఆహార ధాన్యాలు, పప్పుదినుసుల దిగుబడులు కూడా గణనీయంగా 40 నుంచి 50 శాతం పడిపోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కందిపప్పు, మినపప్పు, పెసర్లు, బియ్యం ఉత్పత్తులు తగ్గే అవకాశాలున్నాయని, దీంతో వీటి ధరలు మార్కెట్లో సామాన్యుడికి పెనుభారంగా మారే పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- festive season
- No relief
- Oil
- onion
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

