‘రాకా’ గిన్నిస్ రికార్డ్
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ఫిక్షన్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘రాకా’. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నది.
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ఫిక్షన్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘రాకా’. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నది. మోషన్ క్యాప్చర్ ప్రక్రియతో ఒకేసారి రియల్ టైమ్‌లో ఎక్కువమంది వ్యక్తులకు సంబంధించిన హావభావాలను క్యాప్చర్ చేయడం ద్వారా ‘రాకా’కు ఈ ఘనత దక్కిందని మేకర్స్ తెలిపారు. ఇది సినీ సాంకేతికతలో అరుదైన ఘనత అని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రం కోసం నిర్వహించిన ప్రత్యేక మోషన్ క్యాప్చర్ ప్రక్రియలో 4ఏళ్ల చిన్నారి నుంచి 70ఏళ్ల వ్యక్తి వరకూ మొత్తం 37మంచి కళాకారుల నటనను ఏమాత్రం సహజత్వం దెబ్బతినకుండా ఒకే సెషన్లో, ఒకే రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేశారు. ఇది నిజంగా అరుదైన ఘనత. అందుకే ఈ గౌరవం’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాధించిన ఈ ఘనతకు గాను ఈ నెల 15న అధికారికంగా ‘రాకా’ మేకర్స్‌కి గుర్తింపు లభించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ డాంగ్రికర్ దీనికి సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు అట్లీలకు అందజేశారు. చిత్ర ముఖ్య తారాగణం, సాంకేతిక బృందం సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

