పాలు: ఒక లీటర్, పనీర్ తురుము: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, తరిగిన డ్రైఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తా): అర కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్.
స్టవ్‌మీద గిన్నెపెట్టి పాలుపోసి బాగా మరిగించాలి. మరుగుతున్న పాలలో చక్కెర, పనీర్ తురుము వేసి కలుపుతూ సన్నటి మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ కూడా వేసి మరో రెండు నిమిషాలు మరిగిస్తే నోరూరించే పనీర్ ఖీర్ సిద్ధం.
“Masala Panner fry Recipe | మసాలా పనీర్ ఫ్రై తయారీ విధానం”