దూసుకెళ్తున్న జీ5యాప్.. ఆ ఓటిటి సంస్థ చేతిలోనే RRR సహా 3 పాన్ ఇండియన్ సినిమాల రైట్స్

ZEE5 OTT App | ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైతే శాటిలైట్ రైట్స్ కోసం ఎంత డిమాండ్ ఉండేదో.. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కోసం అంతే డిమాండ్ ఏర్పడింది. నిర్మాతలు కూడా తమ సినిమాలను డిజిటల్ రైట్స్ రూపంలో భారీ రేట్లకు అమ్ముతున్నారు. థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత తమ సినిమాను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. దాంతో ఆయా సంస్థలు కూడా పెద్ద సినిమాలకు భారీ అమౌంట్ ఇచ్చి హక్కులు సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు జీ5 కూడా ఇదే చేసింది. మెల్ల మెల్లగా తెలుగులో భారీ సినిమాలు కొనడం అలవాటుగా మార్చుకుంటుంది జీ స్టూడియోస్. మిగిలిన వాళ్లతో పోటీ తట్టుకోవడానికి ఏకంగా పాన్ ఇండియా సినిమాల హక్కులు సొంతం చేసుకుంటుంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే రాధే శ్యామ్ సినిమాను కొనుగోలు చేసింది జీ5 . ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు మొత్తం జీ5 భారీ ధర పెట్టి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులు ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి. దీని కోసం ఏకంగా రూ.250 కోట్లకు పైగా చెల్లించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరోవైపు రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ హక్కులు మాత్రం తన దగ్గరే ఉంచుకుని మిగతావన్నీ నిర్మాత దిల్ రాజు జీ స్టూడియోస్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇతర సంస్థలతో పోటీపడి మరి భారీ రేటు ఇచ్చి ఈ రెండు పాన్ ఇండియా సినిమాల డిజిటల్ హక్కులు జీ స్టూడియోస్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలతో కచ్చితంగా తమ బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని జీ స్టూడియోస్ యాజమాన్యం అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సంస్థలో భారీ సినిమాలు ఉన్న భారీ విజయాలు లేవు. ఇలాంటి సమయంలో వరుసగా పెద్ద సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నారు. మొన్న విడుదలైన సంక్రాంతి సినిమా బంగార్రాజును కూడా జి స్టూడియోస్ సమర్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్‌గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
కొత్త మెగాస్టార్ అల్లు అర్జునే.. ఇది కఠిన సత్యం.. ఆర్టీవీ ట్వీట్
‘పుష్ప’లో అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్లో కనిపించిన జగదీశ్ ప్రతాప్ బండారి …
అప్పుడే రెండేళ్లు పూర్తి చేసుకున్న అల వైకుంఠపురములో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ott
- radhe shyam
- RRR
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

