అప్పుడే రెండేళ్లు పూర్తి చేసుకున్న అల వైకుంఠపురములో..

Ala Vaikuntapuramlo | 2020 సంక్రాంతి తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికీ మరిచిపోదు. ఎందుకంటే విడుదలైన రెండు పెద్ద సినిమాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఒకవైపు మహేశ్ బాబు.. మరో వైపు అల్లు అర్జున్ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేశ్ బాబు మాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయితే.. అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ కుటుంబ ప్రేక్షకులను చూసుకున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత అరవింద సమేత సినిమాతో తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఆ వెంటనే ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని అల వైకుంఠపురములో అంటూ వచ్చి ఏకంగా 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేశాడు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ మార్కెట్ కూడా డబుల్ అయింది. ఇది మొన్న విడుదలైన పుష్ప సినిమాకి బాగా హెల్ప్ అయింది. అల వైకుంఠపురములో రెండు ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం..
నైజాం: 44.80 కోట్లు
సీడెడ్: 19.30 కోట్లు
ఉత్తరాంధ్ర: 21.90 కోట్లు
ఈస్ట్: 11.60 కోట్లు
వెస్ట్: 9.10 కోట్లు
గుంటూరు: 10.70 కోట్లు
కృష్ణా: 10.60 కోట్లు
నెల్లూరు: 4.67 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 132.67 కోట్లు
ఓవర్సీస్: 18.75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 12.50 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 163.25 కోట్లు షేర్
ప్రీ రిలీజ్ బిజినెస్: 85 కోట్లు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vijay Devarakonda | ‘పుష్ప-3’ కూడా ఉందా?.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
Chandrababu in Pushpa | పుష్ప సినిమాలో చంద్రబాబు.. ఏ సీన్లో కనిపిస్తాడో తెలుసా?
దేశాలు దాటిన పుష్ప క్రేజ్..సామీ సామీ సాంగ్కు టాంజానియా వ్యక్తి అదిరిపోయే స్టెప్పులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

