Chandrababu in Pushpa | పుష్ప సినిమాలో చంద్రబాబు.. ఏ సీన్లో కనిపిస్తాడో తెలుసా?
Chandrababu naidu in Pushpa | అదేంటి పుష్ప సినిమాలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంటాడు అనుకుంటున్నారా..? ఇన్ని రోజులు పెద్దగా ఎవరు ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు ఫోటోలు బయటికి వచ్చిన తర్వాత వాటిని చూసి అందరూ షాకవుతున్నారు. నిజంగానే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ఫోటోలు ఉన్నాయి.

పుష్ప సినిమాను 1995 నుంచి 2004 మధ్యకాలంలో జరిగినట్లుగా చూపించాడు దర్శకుడు సుకుమార్. చిత్తూరు జిల్లాలో అప్పుడు జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. సినిమాలో పరిస్థితులు కూడా అలాగే చూపించాడు సుకుమార్. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు ఫోటో కనిపిస్తుంది. దానికి కారణం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2004 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే పోలీస్ స్టేషన్ సహా మరికొన్ని సన్నివేశాల్లో అక్కడక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా పుష్ప మొదటిసారి పోలీసులకు దొరికిపోయినప్పుడు స్టేషన్లో పెట్టి బాగా కొడతారు. ఆ సమయంలో వెనక గోడకు చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఒక హోటల్లో టీ తాగుతాడు అల్లు అర్జున్. అక్కడ కూడా వెనకాల గోడ మీద చంద్రబాబు ఫోటో కనిపిస్తుంది. నాటి ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి దర్శక నిర్మాతలు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే జనవరి 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా.. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రెండో భాగం 2022 లోనే విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సుకుమార్‌కు ఆ రెండు రీమేక్స్ చేయాలని ఉండేదట..
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

