Allu Arjun | మెగాస్టార్ అనగానే గుర్తొచ్చిదే ఎవరంటే.. చిరంజీవి. ఆయన ఫ్యామిలీకి చిరంజీవి మార్గదర్శి అని కూడా చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఎవరంటే.. రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ మొదటగా గుర్తొస్తారు. వీరిలో అల్లు అర్జున్‌పై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఆర్జీవీ సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు నాంది పలికారు.
కొత్త మెగాస్టార్ అల్లు అర్జున్ అని రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదని ఆర్జీవీ స్పష్టం చేశారు. కొత్త మెగాస్టార్ అల్లు అర్జున్ అనేది కఠిన సత్యం అని రామ్ గోపాల్ వర్మ తేల్చిచెప్పారు.
The hard but indisputable fact is ALLU is the new MEGA
— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2022