గంగోత్రితో సాదాసీదీ హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టి..తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్టైల్ తో స్టైలిష్ స్టార్ అని పిలిపించుకున్నాడు..రీసెంట్గా వచ్చిన పుష్పతో ఐకాన్ స్టార్ ముద్ర వేసుకున్న అల్లు అర్జున్ ( Allu Arjun) ఇవాళ పుట్టినరోజు (Allu Arjun Birthday) జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు చిరు.
‘పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ. నీ కష్టపడేతత్వం, ఫోకస్..నీకు సక్సెస్ అందిస్తుంది. ఈ పుట్టినరోజును జ్ఞాపకంలా మిగిలిపోయేలా గ్రాండ్ పార్టీ చేయాలి’ అంటూ ట్వీట్ చేశాడు చిరు. అల్లు అర్జున్ను విష్ చేస్తూ చిరంజీవి పెట్టిన ట్వీట్ అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంటుంది. వేల సంఖ్యలో ట్వీట్‌కు లైక్స్ వచ్చాయి. మామయ్య లవ్ లీ విషెస్‌కు ఇంకా అల్లు అర్జున్ నుంచి స్పందన రావాల్సి ఉంది.
Happy Birthday Bunny @alluarjun 🎂 Your hard work & focus gives you success. Party hard & make this landmark birthday memorable. 🎉
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2022
ఇటీవలే సుకుమార్ డైరెక్షన్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు. తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇపుడు పుష్ప 2తో మరోసారి బాక్సాపీస్ రికార్డులను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
Happy Birthday @AkhilAkkineni8 💐Wish you all the happiness 🤗 and wish you all the success your talent deserves❤️
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2022
అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. మరోవైపు ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న అక్కినేని అఖిల్‌కు కూడా విషెస్ తెలియజేశాడు చిరు.