ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ యోగా సెలబ్రిటీ మలైకా అరోరా (Malaika Arora). సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..నిత్యం ఏదో ఒక ఫిట్ నెస్, యోగా టిప్‌తో నెటిజన్లు, ఫాలోవర్లలకు మెలకువలు నేర్పిస్తుంటుంది. ఈ బాలీవుడ్ (Bollywood) భామ చేసే యోగాసనాల స్టిల్స్, వీడియోలకు క్రేజీ మామూలుగా ఉండదు. ఓ వైపు డ్యాన్స్ షోలు చేస్తూనే మరోవైపు యోగా ట్రైనర్‌గా బిజీగా ఉంటుంది మలైకా.
ఈ సీనియర్ నటి తనలోని రచయితను అందరికీ పరిచయం చేసేందుకు రెడీ అవుతోంది. అవును మీరు విన్నది నిజమే. ఇప్పటివరకు నటిగా, డ్యాన్సర్, యోగా ఎక్స్‌పర్ట్‌గా పాపులర్ అయిన ఈ సుందరి ఇక రచయితగా కూడా సమాజానికి ఉపయోగపడే అంశాలతో ఓ పుస్తకం రాసేందుకు సిద్దమవుతున్నది. పోషకాహారం (nutrition)పై ఈ బుక్ ఉండబోతుంది.
పుస్తకం గురించి మలైకా మాట్లాడుతూ..ఆరోగ్యం, యోగక్షేమాల (health and wellness)కు సంబంధించిన ఆలోచనలను సులభతరం చేయడమే నా లక్ష్యం. మనలో అంతర్లీనంగా ఉన్న అంశాలను ఇతరులతో పంచుకోవడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుంది. నేను వ్యక్తిగతంగా మన శరీర సమగ్ర శ్రేయస్సును నమ్ముతా. ఒకదానిపై మాత్రమే ఫోకస్ పెట్టడం, ఇతర విషయాలకు మద్దతుగా నిలవదు. అంతర్గతంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనను ప్రమోట్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది మలైకా.
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, ఒక గ్లాసు వేడి నిమ్మకాయ రసం నీటితో మీ రోజును మొదలుపెట్టడం లాంటి అంశాలు ఈ పుస్తకంలో ఉండబోతున్నాయట. అంతేకాదు మలైకా ఆరోగ్య దినచర్యల నుంచి కొన్ని అంశాలు పాఠకులకు ఉండనున్నట్టు తెలుస్తోంది. పోషకాహారం సంబంధిత విషయాలను తెలియజేస్తూ..ఆహార లేమితో ఎదుర్కొనే సవాళ్లు.. మీ ఫిట్నెస్ లక్ష్యాల కోసం న్యూట్రిషన్ ప్లాన్ (పోషకాహార ప్రణాళిక)ను ఎలా సిద్దం చేసుకోవాలో సూచనలు కూడా పొందుపరచనుందట.
Read Also : Kamal Haasan | లాభాలతో కమల్ హాసన్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
Read Also : Brahmastra | షారుక్, నాగార్జున కనిపించేది ఈ పాత్రల్లోనేనట..!
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్‌లో స్టిల్