Brahmastra | షారుక్, నాగార్జున కనిపించేది ఈ పాత్రల్లోనేనట..!
మల్టీస్టారర్‌గా వస్తున్న బ్రహ్మాస్త్ర (Brahmastra). చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నాడు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)తోపాటు స్టార్ హీరో షారుక్ ఖాన్ కీ రోల్ చేస్తున్నాడు.
బాలీవుడ్ (Bollywood)లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra). మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తుండగా..బాలీవుడ్ యాక్టర్లు రణ్ బీర్ కపూర్, అలియాభట్ (Alia bhatt), అమితాబ్ బచ్చన్ , మౌనీరాయ్, టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)తోపాటు స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan)కీ రోల్ చేస్తున్నాడు. కాగా సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో టీం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది.
ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున, షారుక్ కనిపించబోయే పాత్రలు ఇవేనంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. తాజా అప్ డేట్ ప్రకారం నాగార్జున ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనుండగా..షారుక్ సైంటిస్టుగా కనిపించబోతున్నాడట. బ్రహ్మాస్త్రాన్ని కనుగొనాలనే అన్వేషణలో రణ్ బీర్ కపూర్..నాగ్, షారుక్‌ను సంప్రదిస్తాడట. ఇక బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ ట్రైలర్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే.
మూడు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

