Kamal Haasan | లాభాలతో కమల్ హాసన్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విక్రమ్ (Vikram) సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. కేవలం 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.300 కోట్ల క్లబ్ (Rs 300 crore Club)లోకి చేరిపోయింది.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) హోం బ్యానర్ రాజ్ కుమార్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్పై తెరకెక్కించిన చిత్రం విక్రమ్ (Vikram). జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. కేవలం 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా
రూ.300 కోట్ల క్లబ్ (Rs 300 crore Club)లోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి..కాసుల పంట పండిస్తున్న నేపథ్యంలో..లాభాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏం చేస్తాడో ఓ నేషనల్ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు కమల్ హాసన్.
‘ ప్రతీ ఒక్కరు అభివృద్ధి చెందాలంటే..డబ్బుల కోసం బాధపడని నాయకుడు కావాలి. నేను క్షణాల్లో రూ.300 కోట్లు సంపాదిస్తానని అంటే..ఎవరూ అర్థం చేసుకోలేదు. నేను ఊరికెనే ఛాతి చరుచుకుంటున్నానని అనుకున్నారు. కానీ నేను చెప్పింది నిజం కావడం (కలెక్షన్లను ఉద్దేశించి) మీరిప్పుడు చూడొచ్చు. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో నా రుణాలన్నీ కట్టేస్తానన్నాడు’ కమల్
‘ అంతేకాదు నా కుటుంబం, స్నేహితులకు చేయగలిగిందేదైనా చేస్తాను. ఆ తర్వాత నా దగ్గర ఏమీ లేకుంటే..నా దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ లేదు అని చెబుతా. ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని సహాయం చేసినట్లు నటించాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఎటువంటి గ్రాండ్ టైటిల్స్ అవసరం లేదు. నేను కేవలం మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నానని’ చెప్పుకొచ్చాడు కమల్ హాసన్.
కమల్ హాసన్ ఇప్పటికే కోస్టార్ సూర్యకు రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చాడు. మరోవైపు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు ఖరీదైన కారును బహుమతిగా అందించాడు. దీంతోపాటు సినిమాకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు 13 మోటార్ బైక్స్ అందించాడు.
Read Also : Sai Pallavi Interview | విరాట పర్వం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సాయి పల్లవి
Read Also : Deepika Padukone | హెల్త్ న్యూస్‌పై దీపికాపదుకొనే క్లారిటీ..!
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్‌లో స్టిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

