సాధారణంగా సినిమా హీరోలకున్న క్రేజ్‌ను వాణిజ్య సంస్థలు ఏదో రకంగా వాడుకోవాలని చూస్తుంటాయని తెలిసిందే. కంపెనీలు తమ బ్రాండ్లను హీరోలతో ప్రమోట్ చేయించుకునేందుకు భారీ ప్రకటనలు రూపొందిస్తుంటాయి. కోట్లు పెట్టి మరీ యాడ్ ఫిల్మ్స్ (Ad films) చేయిస్తుంటాయి. స్టార్ హీరోల విషయానికొస్తే యాడ్ ఫిలిమ్స్ లో నటించేందుకు తీసుకునే రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోతుంటుంది. అయితే కొందరు మాత్రం తాము ప్రమోట్ చేస్తున్న ప్రొడక్టు ఎలాంటిది..దాని జనాల్లోకి తీసుకెళ్లాలా..? వద్దా ..? అని ఆలోచించి వెనక్కి తగ్గుతుంటారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల ఓ ప్రముఖ వాణిజ్య సంస్థ కమర్షియల్యాడ్ను తిరస్కరించాడు. పొగాకు ఉత్పత్తుల సంస్థ యాడ్ కోసం అల్లు అర్జున్ ముందుకు భారీ మొత్తంలో డీల్‌తో వచ్చినా..బన్నీ మాత్రం ఆ యాడ్ చేసేందుకు నో చెప్పి..చాలా మంది మనసులు గెలుచుకున్నాడు. ఇపుడు మరో పాన్ ఇండియా స్టార్ యశ్ కూడా పెద్ద డీల్ ఒకటి రద్దు చేసుకున్నాడట. భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ యశ్ (Yash) ఇలా సమాజాన్ని పట్టి పీడించే పొగాకును దూరంగా పెట్టాలనే నిర్ణయం తీసుకోవడం పట్ల ఫాలోవర్లు, అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
టొబాకో కంపెనీ (tobacco brand) భారీ ఆఫర్‌తో యశ్ దగ్గరకు రాగా..యశ్ కూడా నో చెప్పాడన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేయగా..ట్రోల్స్ వర్షం కురిపించారు నెటిజన్లు, ఫాలోవర్లు.
Read Also : Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు