బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!

బాలీవుడ్ బాక్సాఫీస్‌పై కరోనా దెబ్బ మామూలుగా లేదు. 2021 తొలి మూడు నెలల్లో మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు కేవలం రూ.50 కోట్లు మాత్రమే కావడం విశేషం. వందల కోట్ల బడ్జెట్లు, వేల కోట్ల బిజినెస్‌లు బాలీవుడ్లో కామన్. కానీ ఈ ఏడాది కొవిడ్ కారణంగా పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, విడుదలైన సినిమాలు కూడా అంతంతమాత్రంగానే సక్సెస్ కావడంతో పెద్ద దెబ్బే పడింది.
ఈ ఏడాది రిలీజైన బాలీవుడ్ మూవీస్‌లో ఒక్క రూహి మాత్రమే రూ.25 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత ముంబై సాగా మూవీ రూ.15 కోట్ల కలెక్షన్లు సాధించింది. మిగతా సినిమాలన్నీ రూ.2 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది ఇప్పటి వరకూ బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.50 కోట్లు కూడా దాటలేదు.
బాలీవుడ్ చరిత్రలో ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. దీని కంటే ముందు బాలీవుడ్లో త్రైమాసికంలో వచ్చిన అతి తక్కువ కలెక్షన్లు రూ.780 కోట్లు కావడం విశేషం. అది కూడా గతేడాదే నమోదైంది. 2020 తొలి త్రైమాసికంలో తానాజీ మూవీ అత్యధికంగా రూ.280 కోట్లు వసూలు చేసింది. అంతకుముందు ఏడాది ఉరి, కేసరి, గల్లీ బాయ్, లూకా చుప్పి, మణికర్ణికలాంటి మూవీస్ హిట్ కావడంతో తొలి త్రైమాసికంలో 1103 కలెక్షన్లు వచ్చాయి.
2019లో పెద్ద పెద్ద హిట్స్ రావడంతో మొత్తంగా రూ.4400 కోట్ల కలెక్షన్లతో బాలీవుడ్ మురిసిపోయింది. అలాంటి సినిమా ఇండస్ట్రీ.. ఈ ఏడాది తొలి మూడు నెలలు కలిపి మొత్తంగా రూ.50 కోట్ల కంటే తక్కువ కలెక్షన్లు సాధించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతేడాది అక్టోబర్ నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటంతో ఈ ఏడాది పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయని అందరూ భావించారు. అయితే మళ్లీ కరోనా కేసులు ఊహించని విధంగా పెరిగిపోతుండటం, లాక్డౌన్లు, ఆంక్షల నేపథ్యంలో పెద్ద సినిమాల విడుదలలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే తలైవీ మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈద్‌కు రావాల్సిన రాధే, సత్యమేవ జయతే 2పై కూడా ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి.
నిజానికి తొలి త్రైమాసికంలోనే కేసుల సంఖ్య తక్కువగా ఉండి థియేటర్లకు ఫుల్ హౌజ్ అనుమతులు జారీ చేసిన సమయంలోనే మూవీస్‌ను రిలీజ్ చేస్తే బాగుండేది. కానీ పెద్ద సినిమాలను ఆలస్యం చేసి బాలీవుడ్ ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు మే చివరి వరకూ పరిస్థితులు మెరుగుపడేలా కనిపించడం లేదు. థియేటర్లలో 50 శాతం సామర్థ్యం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాల రిలీజ్‌కు సాహసించే పరిస్థితి లేదు. ఆ లెక్కన బాలీవుడ్ బాక్సాఫీస్ మరింత కుంగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
ఉత్తరాఖండ్‌లో మళ్లీ కార్చిచ్చు..
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

