Allu Shirish | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ (Allu Shirish).. ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించిన ఆయనకు సరైన కమర్షియల్ బ్రేక్ రాలేదు. గౌరవం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అల్లు వారసుడు ఆ తరువాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడి, ఊర్వశివో రాక్షసివో చిత్రాల్లో నటించాడు. ఇందులో దాదాపుగా అన్ని చిత్రాలు మంచి కథాంశాలతో రూపొందినవే. ఈ కథాంశాల ఎంపికలో అల్లు శిరీష్ ఎంపిక కూడా అభినందనీయమే. అయితే శిరీష్‌కు మాత్రం ఈ చిత్రాలేవీ కమర్షియల్ సక్సెస్‌ను అందించలేకపోయాయి.
తాజాగా ఆయన మరో సారి బడ్డీ (Buddy) చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్క్షానవేల్రాజా నిర్మిస్తున్నారు. శ్యామ్ ఆంటోని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.
అయితే ఈ చిత్రం కోసం సినిమా యూనిట్ టిక్కెట్ల రేట్ల విషయంలో ఓ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ చిత్రం టిక్కెట్ల రేటు సింగిల్ స్క్రీన్ల్లో బాల్కనీ టికెట్ రేటును 99 రూపాయలుగా, మల్టీప్లెక్స్ టిక్కెట్ రేటు 125 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఇది మంచి తెలివైన నిర్ణయమే. అయినా ఈ ఆఫర్‌ను ప్రేక్షకులు నిజంగానే తమకు ఆఫర్‌గా తీసుకుంటారా అనేది సందేహామే. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్‌కు కదలాలంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక మ్యాజిక్ వుండాలి.
మోస్ట్లీ చిన్న సినిమాలను ఆఫర్ ఓటీటీలోనే చూడొచ్చు అని లైట్ తీసుకుంటున్నారు. సో..ఈ ఆఫర్ వల్ల నిర్మాతలకు ఓపెనింగ్స్ రాకపోయినా సినిమా బాగుంటే మౌత్‌టాక్ వల్ల ఈ టిక్కెట్ల ఆఫర్ వల్ల వీరికి ప్రయోజనం కలుగుతుందేమో చూడాలి.
Magadheera | రాంచరణ్ ల్యాండ్ మార్క్ మూవీ మగధీర @ 15 ఇయర్స్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Mani Ratnam | అఫీషియల్.. కమల్‌హాసన్-మణిరత్నం థగ్ లైఫ్ టీంలోకి మరో ఇద్దరు యాక్టర్లు