గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 04, 2020 , 17:23:44

నేను బీరు తాగుతా..చెప్పడానికి భయమెందుకు

నేను బీరు తాగుతా..చెప్పడానికి భయమెందుకు

తన అందం, అభినయంతో చాలా మంది ఫాలోవర్లను సంపాదించుకుంది మళయాళ నటి వీణా నందకుమార్‌. ఇటీవలే మీడియాతో చేసిన చిట్‌ చాట్‌ లో ఈ భామ చాలా ఓపెన్‌ గా తన వ్యక్తిగత విషయాలు షేర్‌ చేసుకుంది. తనకు బీరు అంటే ఎంతో ఇష్టమని, రెండు పెగ్గులు బీరు తాగితే చాలా స్పష్టంగా మాట్లాడుతానని వీణా నందకుమార్ చెప్పడంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌ చేయడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో వీణా స్పందిస్తూ..నేను బీరు తాగితే చాలా సరళంగా, స్పష్టంగా మాట్లాడుతానని ఓ ఇంటర్య్వూలో చెప్పాను. అలా అంటే ఎవరినీ ఇబ్బంది పెట్టినట్టు కాదు.  తాగడం..తాగకపోవడం ఏదైనా ప్రతీ ఒక్కరి వ్యక్తిగత విషయం. నా మాటలను చాలా మంది అపార్థం చేసుకుని నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. తనపై చేసే ట్రోల్స్ పై నెటిజన్లు రివ్యూ చేసుకోవాలని కోరింది. చాలా మంది యువత ప్రస్తుతం బీరు తాగుతున్నారు. యువతి కానీ, యువకుడు కానీ బీరు తాగుతామని చెప్పడానికి ఎందుకు భయపడాలి..? అదేమన్నా పెద్ద నేరమా..? వీణా నందకుమార్ అని ప్రశ్నించింది. 


logo