(Tollywood) టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) యూ టర్న్ తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు (MAA elections) రసవత్తరంగా మారాయి. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ కు మొదటి నుంచి మద్దతిస్తూ వస్తున్న బండ్ల గణేశ్..ఒక్కసారిగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తూ, స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటి చేస్తానని తెలిపారు. అయితే ఈ నిర్ణయం అందరినీ షాక్ గురి చేసింది. అక్టోబర్ 10న జరుగబోయే ఎన్నికల్లో తాను జనరల్ సెక్రటరీగా పోటీచేయబోతున్నట్లు బండ్ల గణేశ్ ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బండ్ల గణేశ్ ఇలా హఠాత్తుగా యూ టర్న్ తీసుకోవడం వెనుక ఎవరున్నారంటూ ఓ వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడంతో బండ్ల గణేశ్ అప్ సెట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. జీవితారాజశేఖర్ దంపతులు గతంలో తాను ఎంతగానో అభిమానించే ఇద్దరు వ్యక్తులైన చిరంజీవి (Chiranjeevi) , పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఎలా అవమానపరిచారో గుర్తు చేసుకున్నాడు గణేశ్. మరోవైపు ప్రకాశ్ రాజ్ కూడా పవన్ కల్యాణ్ రాజకీయ సిద్దాంతాలపై, బీజేపీతో కలిసి వెళ్లడంపై విమర్శలు గుప్పించారు.
తాను వీరాభిమానిగా చెప్పుకునే వ్యక్తులపై చేసిన విమర్శల ఫలితంగానే బండ్ల గణేశ్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని ఇండస్ట్రీ సర్కిల్ లో జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకు రావడం వెనుక మరోవైపు పవన్ కల్యాణ్ ఉండి ఉంటారని కూడా పలువురు సినీ జనాలు చర్చించుకుంటున్నారు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!