బిగ్ బాస్ (Bigg Boss Season 5 Telugu) లో ఒక్కో వారం గడుస్తుంటే పరిస్థితులు ఎంత కఠినంగా మారిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా నామినేషన్ సమయం వచ్చింది అంటే అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవాళ్లే..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఎలాంటి కారణాలతో నామినేట్ చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంటారు. మొదటి రెండు మూడు వారాలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఈజీగా ఊహించవచ్చు. కానీ మూడవ వారం మొదలైన తర్వాత అసలు ఆట మొదలవుతుంది.
అప్పటి నుంచి ఖచ్చితంగా కంటెస్టెంట్స్ కూడా స్ట్రాంగ్ అవుతూ వస్తారు. ఈ వారం కూడా ఇదే జరుగుతుంది. మొదటి వారం సరయు, రెండవ వారం ఉమాదేవి ఎలిమినేట్ అవుతారు అని ముందు నుంచి చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే జరిగింది. కానీ మూడవ వారం ఎవరు బయటికి వస్తారు అనేది మాత్రం చెప్పడం అంత ఈజీ కాదు. కానీ ఒకే ఒక్క నామినేషన్ ప్రక్రియతో మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో.. అవ్వడానికి అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
నిన్న మొన్నటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించిన ప్రియా (Priya).. లహరి (Lahari shari)ని నామినేట్ చేసిన విధానంతో ఒక్కసారిగా విలన్ అయిపోయింది. దాంతో పాటు రవి, లహరి వ్యక్తిగత విషయాల గురించి చర్చించి ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది ప్రియా. ఈ వారం రవి, మానస్, శ్రీ రామ్ చంద్ర, ప్రియా, ప్రియాంక, కాజల్, నటరాజ్ మాస్టర్ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అంతా కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు.
అయితే ప్రియా చేసిన చిన్న తప్పు కారణంగా ఆమెకు ఓట్లు తక్కువ పడేలా కనిపిస్తున్నాయి. ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు అనే ప్రశ్నకు సమాధానం ఈజీగా దొరికినట్లు అయింది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ వారం మా ఇంటి నుంచి ప్రియా సేవ్ కావడం అసాధ్యమే. చూడాలి మరి ఏం జరుగబోతోందో..?
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!