Kiran Abbavaram | ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం పెద్ద టాస్క్ లాంటిదే. అలాంటి ప్రయత్నంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). టాలెంటెడ్ యాక్టర్ చేస్తున్న సరికొత్త ప్రయత్నం క. పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 31న దీపావళి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని నాగచైతన్య ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఈవెంట్లో కిరణ్ అబ్బవరం తనపై వచ్చిన ట్రోల్స్‌పై ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇక్కడదాకా వచ్చాం.. ఏంటి ప్రాబ్లమ్ కిరణ్ అబ్బవరం ఎదగకూడదా..? అంటూ ఆవేదనతో, కోపంతో తన స్పీచ్ మొదలుపెట్టాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం ఎదగకూడదా..? సినిమాలు తీయకూడదా..? ఎస్ఆర్ కళ్యాణమండపం తీశా.. మంచి సినిమా చేశా.. లాక్డౌన్లో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది. నేను బాధతో మాట్లాడుతున్నా.. ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి.. ఎంతమంది నాకు సపోర్టు చేశారో ఓపెన్ చేసి చూపించండి. నాకు ఎలాంటి మద్దతు వచ్చిందో చెప్పండన్నాడు కిరణ్ అబ్బవరం.
దేవుడి పుణ్యమో.. అమ్మానాన్న ఆశీస్సుల వల్లనో పెద్ద పెద్ద బ్యానర్లలో నాకు అవకాశాలొచ్చాయి. చాలా కసితో, ఏదో సాధించాలన్న కోపంతో ప్రతీ రోజు ఏదో ఒకటి చేయాలని..ఏదో ఒక రకంగా కష్టపడేవాడిని. నాకందరూ అవకాశాలిచ్చారు. పెద్ద పెద్ద బ్యానర్లలో చేశాను. చాలా అదృష్టంగా ఫీలయ్యా. అందరం కష్టపడ్డాం. నేను ప్రయత్నించా. కానీ ఒక సినిమా హిట్టయ్యింది.. మరో సినిమా ఫ్లాపయింది.. కానీ కష్టంలో మాత్రం ఎప్పుడూ లోపం లేదు. స్క్రీన్‌పైన నేను కనబడటం లేదంటే నాకు రాక కాదు.. నిద్రలేక. నేనెందుకిలాంటి సినిమా చేస్తున్నానని తల పగిలిపోయేది. లైఫ్‌లో ఏమవుతుంది. ఏదో గట్టిగా చేయాలి కదా అని పరితపించేవాడిని.
మంచి సినిమాలు. కొన్ని సినిమాలు పోయాయి. కానీ నా బాధేంటంటే.. ఈ విషయం చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్లు పగబడతారని కూడా నాకు తెలుసు. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఓ కంపెనీ ఉంటది. నేను చాలా ఫీలయ్యానని చెప్తున్నా. ఏదో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. సంవత్సరానికి రెండు సినిమాలు, మూడు సినిమాలొచ్చాయనేది పక్కన పెడితే.. నా మీద వాళ్లు ట్రోల్స్ చేశారు. ఏమైనా సంబంధమా.. నా మీద మీరు సినిమాలో ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది.
నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నా.. నా పనేదో నేను చేసుకుంటున్నా.. ఎందుకన్నా నేను మిమ్మల్ని ఏమైనా అడిగానా..? ఏంటీ. కనీసం సమాచారం లేకుండా నా మీద డైరెక్టుగా సినిమాలో ట్రోలింగ్ చేశారు.బ్రో మరి మీ గురించి ఇలా సినిమాలో వేస్తున్నారేంటి అని అభిమానులు అడిగుతున్నారు. మీ సినిమాలో ట్రోల్ చేసేంత నేను మీకు ఏం చేశానో చెప్పండి. నా కష్టంతో ఏదో ఒక సినిమా చేసుకుంటున్నా అని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
Actor @Kiran_Abbavaram shares an emotional story about his fighter mom that Changed his career path🔥 pic.twitter.com/dA7mBwcwyj
— Sreenivas Gandla (@SreenivasPRO) October 29, 2024
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..