Mathu Vadalara 2 | రితేశ్ రానా దర్శకత్వంలో క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన మత్తు వదలరా చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ప్రాజెక్ట్ మత్తు వదలరా 2 (Mathu Vadalara 2). శ్రీసింహా (Sri Simha), సత్య కాంబినేషన్లో టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం మేకర్స్ మత్తు వదలరా 2 టీజర్‌ను లాంచ్ చేశారు.
హి..హి..హి.. టీమా అంటే అన్నీ హిలు లేవు.. ఒకటే హి అంటూ ఫన్నీగా సాగుతున్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గు లేదా.. అంటుంటే.. అయినా ఇది దొంగతనం కాదు.. తస్కరించుట అంటున్నాడు సత్య. ఓ వైపు, మరోవైపు కామెడీ ట్రాక్‌తో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు డైరెక్టర్.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఇప్పటికే కొత్త పోస్టర్లు కూడా షేర్ చేశారు. భారీ నేరాలు. అధిక వాటాలు.. భారీ నవ్వులు అంటూ షేర్ చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్‌కు కాల భైరవ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మత్తు వదలరా 2 టీజర్..
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?