Karuppu | తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు సూర్య (Suriya). రెండు భాషల్లో సూర్య సినిమాలకు మంచి మార్కెట్ కూడా ఉంటుంది. ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకి అట్లూరితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మరోవైపు సూర్య కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. Karuppu టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. డిజిటల్ రైట్స్ డీల్ కుదుర్చుకోవడంలో ఆలస్యం కారణంగా విడుదల తేదీపై డైలామా నెలకొందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ డైలమాకు చెక్ పెట్టాడు డైరెక్టర్ ఆర్జే బాలాజీ.
ఓ అవార్డ్ ఫంక్షన్లో ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. సినిమా దాదాపు పూర్తయింది. దీపావళి విడుదలకు ప్లాన్ చేశాం. సీజీ వర్క్ కారణంగా ఆలస్యమవుతుంది. నాతోపాటు నిర్మాతలు చాలా ప్రేమతో మనసు పెట్టి చేస్తున్న సినిమా ఇది. దీపావళికి ఫస్ట్ సాంగ్ వస్తుంది. సూర్య సార్ తన డ్యాన్స్‌తో సెగలు పుట్టించడం ఖాయమన్నాడు ఆర్జే బాలాజీ. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డ్రీమ్ వారియర్పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే