Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన ఆమె, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రూపొందుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఎ.డి.2’ వంటి భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయానికి గల కారణాలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనప్పటికీ, సోషల్ మీడియాలో పలువురు వినిపించిన వాదనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో దీపిక స్పందిస్తూ, “నాకు ఇబ్బందిగా అనిపిస్తే ఏ ప్రాజెక్ట్ అయినా అంగీకరించను” అని స్పష్టం చేశారు.
‘భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు సంవత్సరాలుగా రోజుకి 8 గంటల పని మాత్రమే చేస్తున్నారు. ఇది ఎటువంటి రహస్యమైన విషయం కాదు. కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. వారెవరో పేర్లు చెప్పాలనుకోవడం లేదు కానీ, వారంతా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తూ, వీకెండ్స్ పూర్తిగా వారి సొంత పనులు చేసుకుంటారు,” అని దీపిక వివరించారు. ‘స్పిరిట్’ మరియు ‘కల్కి 2’ చిత్రాల నుంచి ఆమె తప్పుకోవడంపై నేరుగా మాట్లాడకపోయినా, తన పని సమయాలు గురించి తాను గట్టిగా నిలబడిన విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో “రెమ్యునరేషన్ ఎక్కువ అడిగిందన్న” వార్తలు చక్కర్లు కొట్టగా, దానిపై ఏ మాత్రం స్పందించకుండానే దాటవేశారు.
“న్యాయంగా పోరాటం చేసినందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారా?” అనే ప్రశ్నకు దీపిక స్పందిస్తూ, ఇలాంటి పరిస్థితులు నాకు కొత్తకావు. ఎన్నో పోరాటాలు నిశ్శబ్దంగా చేశాను. వాటిపై ప్రతిస్పందించడంలో ఆసక్తి లేదు. గౌరవంగా ఉండాలంటే సైలెంట్‌గా పోరాటం చేయడం నేర్చుకోవాలి” అని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం దీపిక పదుకొణే షారుక్ ఖాన్ – సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ – అట్లీ కలయికలో తెరకెక్కనున్న మరో పాన్-ఇండియా చిత్రానికి కూడా ఆమె సైన్ చేసింది. ఈ రెండు చిత్రాలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాగా, ఈ సినిమాలతో దీపికా క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.