Srinidhi Shetty | కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది శ్రీనిధి శెట్టి. తెలుగులో నానితో హిట్ 3లో కలిసి నటించింది. ఈ భామ ప్రస్తుతం సిద్దుజొన్నలగడ్డతో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది శ్రీనిధిశెట్టి.
చిట్ చాట్ సెషన్లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. కేజీఎఫ్, హిట్ 3 లాంటి వయోలెన్స్, రక్తపాతం చుట్టూ తిరిగే సినిమాల తర్వాత సున్నిత భావోద్వేగాలతో సాగే సినిమా ఇది. ఈ మూవీ నాకు ఉత్తేజాన్ని కలిగించే మార్పులాంటిది. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానంది. తెలుసు కదా ప్రేమ, ఎమోషన్, నవ్వులు, అందమైన పాటలతో సాగే కమర్షియల్ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మూవీ లవర్స్ ఒక అందమైన రొమాంటిక్ డ్రామాను చూసినట్టు ఫీల్ అవుతారంది శ్రీనిధి శెట్టి .
సినిమాకు పనిచేయడం గురించి మాట్లాడుతూ.. నాకు డైరెక్టర్ నీరజ కోన, సిద్ధు, రాశీ ఖన్నాతో కలిసి నటించే అద్భుతమైన సమయం దొరికింది. నీరజ కోన చాలా సపోర్ట్‌గా నిలిచే వ్యక్తి. ప్రేక్షకులు ఖచ్చితంగా సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు. అతడికి ప్రతీ విభాగంలో అద్బుతమైన ప్రావీణ్యం ఉంది. రాశీఖన్నా చాలా క్రమశిక్షణతో ఉండే వ్యక్తి అని చెప్పుకొచ్చింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నానంది. సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానంది శ్రీనిధిశెట్టి.
NTR | ‘వార్ 2’ ఫ్లాప్‌తో ఎన్టీఆర్ హిందీ కెరీర్ ముగిసింది?.. కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే