NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ‘వార్ 2’ అనే చిత్రంతో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది
ఇదే సమయంలో బాలీవుడ్ యాక్టర్-కమ్-క్రిటిక్ కమల్ ఆర్. ఖాన్ (KRK) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వివాదాస్పద ట్వీట్లకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కమల్ ఆర్ ఖాన్ ఈసారి కూడా కాస్త కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. “ఒక ఫ్లాప్ సినిమా చాలా విషయాలను మార్చగలదు. ‘వార్ 2’ ఫెయిల్యూర్ తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ హృతిక్ రోషన్‌తో ‘క్రిష్ 4’ చేయకూడదని నిర్ణయించింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ‘ధూమ్ 4’ నుంచి తీసేశారు. హృతిక్ ఇకపై యష్ రాజ్ బ్యానర్‌తో పని చేయడు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ప్రాజెక్ట్‌ను కూడా రద్దు చేశారు. కియారా అద్వానీ కెరీర్ కూడా డ్యామేజ్ అయింది. ఎన్టీఆర్ హిందీ కెరీర్ ఇక్కడితో ముగిసిపోయింది ” అని KRK ఎక్స్ ( ట్విట్టర్) లో పోస్ట్ చేశాడు.
అతడి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కమల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. “ వార్ 2’ సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఆడకపోయినా, ఇది ఫ్లాప్ కాదు. రూ.350 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్ ప్రెజెన్స్ సినిమాకు భారీ హైప్ తెచ్చింది” అంటూ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. మరికొందరు “కమల్ ఖాన్ కి ఇది అటెన్షన్ గేమ్ మాత్రమే. సౌత్ హీరోల సక్సెస్ చూడలేకపోతున్నాడు” అని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ‘వార్ 2’ స్ట్రీమింగ్ అవుతోంది. హృతిక్-ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్, స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి మంచి క్రేజ్ కనిపిస్తోంది.