Kiran Abbavaram | కథను నమ్మి సినిమాలు చేసే టాలీవుడ్ యాక్టర్లలో ఒకడు కిరణ్ అబ్బవరం. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం కే-ర్యాంప్ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 18న దీపావళి ట్రీట్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
కాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం ఆసక్తికర విషయమొకటి షేర్ చేసుకున్నాడు. కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్‌తో కలిసి పనిచేసే అవకాశమున్నట్టు కిరణ్ అబ్బవరం హింట్ ఇచ్చేశాడు. తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడని.. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్‌తోపాటు ఇతర వివరాలు వెల్లడిస్తామని కిరణ్ అబ్బవరం చెప్పాడని కథనం ఒకటి నెట్టింట ఊపందుకుంది.
అనిరుధ్ రవిచందర్ అంటే మ్యూజిక్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటుందని తెలిసిందే. ఇదే నిజమైతే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బీజీఎం కిరణ్ అబ్బవరం కెరీర్‌కు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇదే కాకుండా కిరణ్ అబ్బవరం ఓ వెబ్ సిరీస్‌ను కూడా చేయబోతుండగా ఈ ప్రాజెక్ట్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని చెప్పాడు. మరోవైపు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా కూడా చేయబోతన్నానని చె్ప్పాడు.
NTR | ‘వార్ 2’ ఫ్లాప్‌తో ఎన్టీఆర్ హిందీ కెరీర్ ముగిసింది?.. కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే