Gautham Vasudev Menon | యాక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉందని తెలిసిందే. కాగా శింబుతో చేయాలనుకున్న సినిమా అభిప్రాయ బేధాల కారణంగా వర్కవుట్ కాలేదంటూ ఆసక్తికర విషయాన్ని షేర్ చేశాడు గౌతమ్ మీనన్.
ఈ విషయమై గౌతమ్ మీనన్ ఓ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. మేము వీటీకే పార్ట్ 2 (VTK PART-2) కథ రాసుకున్నాం. కానీ శింబు ఈ సినిమాను భారీ స్థాయిలో తీయాలని కోరుకున్నాడు. అందుకే అతడు సీక్వెల్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపలేదు. పార్ట్-1 విడుదలైన 25 రోజుల తర్వాత సినిమాపై శింబు ఆసక్తి చూపించలేదు. బాక్సాఫీస్‌తో పోటీ పడటానికి ఏ మాత్రం సిద్దంగా లేడు. అందుకే మా ఇద్దరికీ సినిమా విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.
వీటీకే పార్ట్ 1 (Vendhu Thanindhathu Kaadu) రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కాగా గౌతమ్ మీనన్ కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్‌తో లాంగ్ టైం పెండింగ్ ప్రాజెక్ట్ ధృవ నక్షత్రం చేయాల్సి ఉండగా.. కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
గౌతమ్ మీనన్ ఇటీవలే డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (Dominic and the Ladies’ Purse). మమ్ముట్టి లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ