Ori Devuda Movie | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫలితం ఎలా వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మంచి విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం అదే జోష్‌తో అరడజను సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘ఓరి దేవుడా’ మూవీ ఒకటి. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఒరిజనల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్ ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ మరో క్రేజీ అప్డేట్ను తీసుకొచ్చింది.
ఈ సినిమాలోని ‘గుండెలోనా’ అంటూ సాగే మెలోడియస్ పాటను మంగళవారం సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. లైఫ్ మనకు ఇంకొక చాన్స్ ఇస్తే.. గతంలో మనం తీసుకున్న నిర్ణయాలను మార్చుకోగలిగితే జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
Get ready to dance 🕺💃#Gundelonaa storm ⛈ arrives today in the voice of the storm himself @anirudhofficial !
Full Video out today @ 5:04PM💥💥#Oridevuda #OriDevudaOnOct21st
Written & Directed by @Dir_Ashwath@VishwakSenActor @mipalkarofcl @StarAshaBhat @leon_james pic.twitter.com/8CVltB7Ytk
— PVP Cinema (@PVPCinema) October 11, 2022
Read Also:
Ponniyin Selvan-1 | ‘400కోట్ల’ క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’ ఎంట్రీ..!
Siva Karthikeyan | నాగచైతన్య దర్శకుడితో.. శివ కార్తికేయన్ నెక్స్ట్ చిత్రం..!
‘లైగర్’ ఫ్లాప్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?