‘లైగర్’ ఫ్లాప్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda | టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉండే క్రేజే వేరు. అర్జున్ రెడ్డి సినిమాతో ఈ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలతో మెప్పించిన విజయ్.. ఇటీవల మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా
Vijay Deverakonda | టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉండే క్రేజే వేరు. అర్జున్ రెడ్డి సినిమాతో ఈ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలతో మెప్పించిన విజయ్.. ఇటీవల మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ తొలిసారిగా సైమా అవార్డ్స్ 2022లో పాల్గొన్నారు. యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం లైగర్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ విజయ్ ఉద్వేగానికి లోనయ్యారు.
‘‘ఈ వేదికపై అవార్డులు అందుకున్న అందరికీ కృతజ్ఞతలు. గొప్ప సినిమాలు, అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో మీరు ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నాను. అందుకు చాలా ప్రయత్నించాను. కానీ అది సరిపోలేదు. మనందరికీ మంచి, చెడు రోజులు వస్తూ ఉంటాయి. ఏ రోజుల్లోనైనా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులు కచ్చితంగా, చాలా జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ వేడుకకు రాకూడదనుకున్నాను. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్పాలని వచ్చాను. మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని మాటిస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్అవుతోంది.ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సమంతకథానాయికగా నటిస్తోంది.
I can feel his pain #VijayDeverakonda 🥺🧡 pic.twitter.com/HeKTRuaA7g
— ROWDY ADMIRER (@Always__tarun) October 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

