VS 13 | ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ సినిమాతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen). మీనాక్షి చౌదరి, శ్రద్దాశ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం విడుదల కాకముందే కొత్త సినిమా VS 13 కూడా లాంచ్ చేశాడు. ప్రీ లుక్ కూడా విడుదల చేయగా.. విశ్వక్సేన్ వైట్ షర్ట్ అండ్ ఖాకీ ప్యాంట్లో పిస్తోల్‌తో గ్యాంగ్ వార్‌ను నియంత్రించే పోలీస్‌గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
తాజా టాక్ ప్రకారం ఇందులో విశ్వక్ సేన్ ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్నాడట. మరి విశ్వక్సేన్ కోసం శ్రీధర్ గంటా ఎలాంటి కథ రెడీ చేశాడనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీధర్ గంటా కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ నంబర్ 8గా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ షురూ కానుంది. ఈ చిత్రంలో కన్నడ భామ సంపద హీరోయిన్గా నటిస్తోంది.
నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి VS 13ను తెరకెక్కిస్తున్నాడు. హిట్ తర్వాత ఈ చిత్రంలో విశ్వక్సేన్ మరోసారి పోలీసాఫీసర్ గెటప్‌లో కనిపించబోతుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్
Nani | ఓజీ డైరెక్టర్ సుజిత్ సినిమాకు బ్రేక్ పడిందా..? నాని క్లారిటీ
Stree 2 | ఫైటర్, కల్కి 2898 ఏడీ రికార్డు బ్రేక్.. ఆ జాబితాలోకి శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఎంట్రీ..!