మైక్ దొరికితే స్టేజి మీద ఊగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సమయంలో వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకు కూడా తెలియదు. ఆ తర్వాత తీరిగ్గా వింటే అమ్మో మనం ఇంత మాట్లాడామా.. అనిపిస్తుంది. తాజాగా మన టాలీవుడ్ (Tollywood) కుర్ర హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే చాలా రోజుల తర్వాత మైక్ చూసేసరికి కంట్రోల్ తప్పుతున్నారు. ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. విడుదలకు ముందు అత్యుత్సాహంతో.. సినిమాపై అతి నమ్మకంతో ఏది పడితే అది మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోతున్నారు.
మొన్న పాగల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో.. సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా గుర్తు పెట్టుకోండి.. నా పేరు విశ్వక్ సేన్ (Vishwak Sen) అంటూ సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ కూడా చాలానే జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో హీరో కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. అతనెవరో కాదు శ్రీ విష్ణు (Sri Vishnu). ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉండే ఈ హీరో తొలిసారి కాస్త ఓపెన్ అయ్యాడు. ఈయన హీరోగా నటించిన రాజ రాజ చోర సినిమా ఈ వారం విడుదల కానుంది. కమర్షియల్ కంటే కూడా కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇష్టపడుతుంటారు శ్రీ విష్ణు.
ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన గాలి సంపత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు రాజ రాజ చోర అంటూ వస్తున్నాడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీ విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నవ్వలేక మాస్కులు ఊడిపోతాయి..ఎందుకైనా మంచిది రెండు మూడు మాస్కులు ఎక్కువ తెచ్చుకోండి అంటూ ఈయన చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ జరుగుతుంది. మాస్కులు మాత్రమే సరిపోతాయా..? ఇంకా ఏదైనా ఎక్స్ ట్రా తెచ్చుకోవాలా..? అంటూ ఈయనపై కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత మైకులు దొరగడంతో తమ సినిమాలను ఆకాశానికి ఎత్తే క్రమంలో కాస్త కంట్రోల్ తప్పుతున్నారు మన హీరోలు.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!