VS 13 | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్దాశ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా విశ్వక్సేన్ కొత్త సినిమా VS 13 ప్రీ లుక్ విడుదల చేయగా.. విశ్వక్సేన్ వైట్ షర్ట్ అండ్ ఖాకీ ప్యాంట్లో పిస్తోల్‌తో గ్యాంగ్ వార్‌ను నియంత్రించే పోలీస్‌గా కనిపిస్తున్న హాఫ్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా VS13 లాంచ్ చేశాడు విశ్వక్సేన్. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీధర్ గంటా కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రొడక్షన్ నంబర్ 8గా రానున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది.
నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి VS 13ను తెరకెక్కిస్తున్నాడు. హిట్ తర్వాత ఈ చిత్రంలో విశ్వక్సేన్ మరోసారి పోలీసాఫీసర్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో కన్నడ భామ సంపద హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫర్.
#VS13 – @SLVCinemasOffl Production No.8 begins with an auspicious pooja ceremony ✨
⭐ing MASS KA DAS @VishwakSenActor #Sampaada ❤🔥
Written and directed by #SreedharGanta
Shoot begins soon!@sudhakarcheruk5 @innamuri8888 @AJANEESHB @kishorkumardop pic.twitter.com/yOvDTiFvzk
— SLV Cinemas (@SLVCinemasOffl) August 15, 2024
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !