టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) యాక్షన్ కింగ్ అర్జున్‌తో చేస్తున్న సినిమా రద్దైన విషయం తెలిసిందే. దీంతో ధమ్కీ సినిమాపై ఫోకస్ పెట్టాడు. కాగా ఇప్పటికే విశ్వక్ సేన్ ధమ్ కీ (Dhamki) టీజర్ పనులపై ఫోకస్ పెట్టాడంటూ ఓ వార్త కూడా బయటకు వచ్చింది. తాజాగా మాస్ కా దాస్ టీం ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.
ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ధమ్ కీ తొలి సాంగ్‌ను ముంబైలోని యశ్‌రాజ్ ఫిలింస్ స్టూడియోస్‌లో రికార్డు చేశారు. నకాస్ అజీజ్ ఈ ట్రాక్‌ను పాడాడు. ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు విశ్వక్ సేన్. ఫస్ట్ హిందీ సాంగ్ రెడీ అవడంతో చాలా ఎక్జయిట్ అవుతున్నాడు విశ్వక్ సేన్. నా తొలి హిందీ సాంగ్ కోసం నకాశ్ అజీజ్‌తో పనిచేయడం గొప్పగా భావిస్తున్నా..లవ్ యూ బ్రదర్ అంటూ క్యాప్షన్ పెట్టాడు విశ్వక్ సేన్. ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది.
ధమ్ కీ చిత్రంలో రావు రమేశ్ హైపర్ ఆది, పృథ్విరాజ్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ధమ్ కీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధమ్ కీ సినిమా నుంచి డైరెక్టర్ తప్పుకోవడంతో విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ కామెడీ థ్రిల్లర్‌కు ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నాడు.
Read Also : Anusha Shetty | నాగశౌర్య ఫియాన్సీ అనూషశెట్టి బ్యాక్‌గ్రౌండ్ వివరాలివే..!
Read Also : Sid Sriram | హిట్ 2లో సిద్ శ్రీరామ్ ఉరికెఉరికె పాట షురూ అయిందిలా.. వీడియో వైరల్
Read Also : Telugu Film Producers Council | సంక్రాంతి సినిమాల రిలీజ్‌పై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్.. వివరాలివే