Anusha Shetty | నాగశౌర్య ఫియాన్సీ అనూషశెట్టి బ్యాక్‌గ్రౌండ్ వివరాలివే..!
త్వరలోనే బిజినెస్ఉమెన్ అనూషశెట్టి (Anusha Shetty)తో ఏడడుగులు వేయబోతున్నాడు నాగశౌర్య. వెడ్డింగ్ అప్డేట్ వీడియోను షేర్ చేయగానే..ఇంతకీ అనూషశెట్టి ఎవరు..? అని నెటిజన్లు, మూవీ లవర్స్ గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బెంగళూరుకు చెందిన బిజినెస్ఉమెన్ అనూషశెట్టి (Anusha Shetty)తో ఏడడుగులు వేయబోతున్నాడు నాగశౌర్య. వెడ్డింగ్‌కు సంబంధించిన అప్డేట్ వీడియోను షేర్ చేయగానే..ఇంతకీ అనూషశెట్టి ఎవరు..? అని గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు, మూవీ లవర్స్. నాగశౌర్య కాబోయే భార్య అనూషశెట్టి గురించి కొన్ని విషయాలు.. మీకోసం
అనూష శెట్టి స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందపూర్ గ్రామం. ఇంటీరియర్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అనూష డిజైన్స్ పేరుతో సొంత కంపెనీ కూడా నిర్వహిస్తోంది. 2019లో స్థాపించబడ్డ అనూష డిజైన్స్..స్థాపకురాలు అనూష సారథ్యంలో చాలా అవార్డులు అందుకుంది. డిజైనర్ ఆఫ్ ది ఇయర్-2019, 40 అండర్ 40 బెస్ట్ ఇంటరీయర్ డిజైనర్ ఇన్ ది కంట్రీ -2020, మోస్ట్ ఇన్నోవేటివ్ లగ్జరీ ఇంటరీయర్ డిజైనర్ 2020, ఇండియా టాప్ 10 ఇంటీరియర్ డిజైనర్స్-2021 అవార్డుతోపాటు పలు పురస్కారాలు అందుకుంది.
అంతేకాదు అనూష శెట్టి Women Entrepreneur magazine కవర్‌పేజీపై కూడా మెరిసింది. తక్కువ టైంలోనే ఇండియాలో ప్రముఖ బిజినెస్‌వుమెన్‌గా నిలిచింది. నాగశౌర్య-అనూష వెడ్డింగ్ పనులు నవంబర్ 19న మొదలు కానున్నాయి. నవంబర్ 20న 11:25 గంటలకు నాగశౌర్య-అనూష వివాహం బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో జరుగనుంది.
Read Also : Naga Shaurya | బ్యాచ్‌లర్ లైఫ్‌కు యువ హీరో నాగశౌర్య గుడ్‌బై.. వెడ్డింగ్ బెల్స్ వీడియో
Read Also : Sid Sriram | హిట్ 2లో సిద్ శ్రీరామ్ ఉరికెఉరికె పాట షురూ అయిందిలా.. వీడియో వైరల్
Read Also : Telugu Film Producers Council | సంక్రాంతి సినిమాల రిలీజ్‌పై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

