Telugu Film Producers Council | సంక్రాంతి సినిమాల రిలీజ్‌పై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్.. వివరాలివే
ఎప్పటిలాగే వచ్చే సంక్రాంతి -2023- (Sankranthi 2023)కి భారీ చిత్రాలు క్యూలైన్లో ఉన్నాయి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council)ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ప్రతీ ఏడాది సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఎప్పటిలాగే వచ్చే సంక్రాంతి (2023)కి భారీ చిత్రాలు క్యూలైన్లో ఉన్నాయి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారిసు, తునివు తెలుగు రాష్ట్రాల్లో 2023 సంక్రాంతి (Sankranthi 2023)కి విడుదల కాబోతున్నాయి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council)ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి మొదటి ప్రాధాన్యత స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ థియేటర్లు మిగిలితే ఆ థియేటర్లలో డబ్బింగ్ సినిమాలను విడుదల చేసుకోవచ్చని నోట్ లో పేర్కొంది. తెలుగు సినిమాల నిర్మాణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని, నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో.. సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇవ్వాలని 08-12-2017 మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం తాజా నిర్ణయం తీసుకున్నట్టు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నోట్లో తెలిపింది.

అయితే ఈ నాలుగు సినిమాల్లో దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ చిత్రం వారిసు ఉంది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల అవుతుంది. ఈ మూవీ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాకపోవడంతో విడుదల అంతా సవ్యంగానే ఉంటుందా..? అని ఇపుడు అందరూ చర్చిస్తున్నారు. మరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెస్ నోట్ నేపథ్యంలో దిల్ రాజు ఏమైనా స్పందిస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు.

సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశాలున్నట్టు ఫిలినగర్ సర్కిల్ సమాచారం. మరి ఈ రెండు భారీ సినిమాలు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి బరిలో పై సినిమాలుంటాయా..? ఉంటే ఎన్ని థియేటర్లు దొరుకుతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్..
Telugu Film Producers Council Press Note.#TFPC #PRESSNOTE pic.twitter.com/uu9oqqc0uc
— Telugu Film Producers Council (@tfpcin) November 13, 2022
Read Also : Anusha Shetty | నాగశౌర్య ఫియాన్సీ అనూషశెట్టి బ్యాక్‌గ్రౌండ్ వివరాలివే..!
Read Also : Sid Sriram | హిట్ 2లో సిద్ శ్రీరామ్ ఉరికెఉరికె పాట షురూ అయిందిలా.. వీడియో వైరల్
Read Also : Telugu Film Producers Council | సంక్రాంతి సినిమాల రిలీజ్‌పై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

