Vishnu Manchu | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Vishnu Manchu) తొలిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నాడని తెలిసిందే. ప్రస్తుతం ముఖేశ్ కుమార్ సింగ్ (Vishnu Manchu) డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కాగా ఈ యాక్టర్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. గుడ్‌న్యూస్ అంటూ పెట్టిన సస్పెన్స్‌కు తెరదించాడు విష్ణు. ఎవరూ ఊహించని షాక్ ఇస్తూ.. తాను పాపులర్ హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్‌తో కలిసి పనిచేయబోతున్నట్టు వెల్లడించాడు.
50 మిలియన్ డాలర్లు పెట్టుబడితో తరంగ వెంచర్స్ (Taranga Ventures) ను ప్రారంభించనున్నట్టు ప్రకటించాడు. దీని ద్వారా మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజా సమాచారం ఈ విషయమై విల్ స్మిత్ చర్చలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని ఇన్సైడ్ టాక్. విష్ణుతోపాటు ఇతర రంగాలకు చెందిన పలువురు నిఫుణులు భాగస్వామ్యం కాబోతున్నట్టు సమాచారం. తరంగ వెంచర్స్ ఓటీటీ ప్లాట్‌ఫాంలు, గేమింగ్, బ్లాక్ చెయిన్, ఏఆర్, వీఆర్, ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీల్లో పెట్టుబడులపై దృష్టిపెట్టనుంది.
అంతేకాదు కేవలం ఆర్థిక సహాయానికి మాత్రమే పరిమితం కాకుండా ఎంటర్టైన్మెంట్ విభాగంలో స్టార్ట్ప్లకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుంది. మొత్తానికి టాలీవుడ్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకోవడంతో.. అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
A Game-Changing Move in Entertainment Industry#TarangaVentures , led by @iVishnuManchu , is in final talks with Hollywood icon @WillSmith2real to join as a key partner 🌟
The $50M media & entertainment tech fund, with a potential $50M extension, is set to drive innovation in… pic.twitter.com/sCg5E9LYBI
— BA Raju’s Team (@baraju_SuperHit) December 14, 2024
Singham Again | ట్విస్ట్‌తో అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ ఓటీటీ ఎంట్రీ