Samantha | రానా దగ్గుబాటి (Rana Daggubati) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో సినీ సెలబ్రిటీలు సైతం రానాకు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో స్టార్ నటి సమంత (Samantha) సైతం రానాకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
‘హ్యాపీ బర్త్ డే రానా. నువ్వు చేసే ప్రతి పనిలోనూ వంద శాతం ఫోకస్ పెడుతుంటావు. ఈ విషయంలో నీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడు ఆశీర్వాదులు నీకు ఎప్పుడూ ఉండాలి’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, రానా ప్రస్తుతం సరికొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘నం1 యారి’ అంటూ ఓటీటీలో సందడి చేసిన రానా.. ఇప్పుడు ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show) అనే పేరుతో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ షో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Rana Samantha2
Also Read..
Mohan babu | నేను ఎక్కడికీ పారిపోలేదు.. అజ్ఞాతం వార్తలపై స్పందించిన మోహన్‌బాబు
Allu Arjun | పుష్పరాజ్.. ఖైదీ నెంబర్ 7697.. జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఏం చేశారంటే.!
Allu Arjun Press Meet | జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ మరోసారి ప్రెస్ మీట్.. ఏమన్నారంటే.!