Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం అరెస్ట్ అవ్వడంతో చంచల్‌గుడా జైలుకు తరలించగా.. హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే విడుదలకు సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తికాకపోవడంతో నైట్ అంతా జైలులోనే గడిపాడు అల్లు అర్జున్. అయితే జైలులో ఉన్న అల్లు అర్జున్‌కి అధికారులు ఎలాంటి వసతి కల్పించారు. బన్నీ ఎలా ఉన్నాడు అనే దానిపై ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
అల్లు అర్జున్‌ని చంచల్‌గుడాలోని వీఐపీ బ్లాక్ ఉంచినట్లు తెలుస్తుంది. ఇక జైలులో ఉన్న అల్లు అర్జున్‌కు అండర్ ట్రయల్ ఖైదీగా యూటీ (Under Trail Prisoners) 7697 నంబర్‌ను అధికారులు కేటాయించారు. రాత్రంతా మంజీరా బ్యారక్‌లోని బ్లాక్ -1లో అల్లు అర్జున్‌ని ఉంచగా.. తెల్లవారేవరకు అల్లు అర్జున్ నిద్రపోకుండానే గడిపినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ పడుకునే ముందు జైలు సిబ్బంది రగ్గు దుప్పటి ఇచ్చినట్లు సమాచారం. అయితే వీటిని తిరస్కరించి అల్లు అర్జున్ నేలపైనే పడుకున్నట్లు.. ఇక జైలులో ఉన్నంత సేపు అధికారులతో తప్ప ఎవరితో బన్నీ మాట్లాడలేదని తెలుస్తుంది. రాత్రి జైలులో అధికారులు భోజనం అందించగా.. కొంచెం తిని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఉదయం 5.45 గంటలకు బన్నీని జైలు నుంచి బయటకు తీసుకువచ్చి.. విడుదలకు సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తిచేసినట్లు.. ఉదయం 6.39 గంటలకు విడుదల చేసినట్లు సమచారం.
Also Read..