Ram Gopal Varma | టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి బన్నీ గొప్ప బహుమతి ఇస్తే.. అరెస్ట్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంటూ విమర్శించారు. ‘తెలంగాణ నివాసి అయిన అల్లు అర్జున్ భారత్‌లోనే బిగ్గెస్ట్ స్టార్. భారతీయ సినిమా చరిత్రలో భారీ హిట్ కొట్టి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందిచారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయనను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
. @alluarjun the BIGGEST STAR of INDIA, a resident of TELANGANA STATE has given the GREATEST GIFT to the TELANGANA STATE by giving the BIGGEST HIT in the ENTIRE HISTORY of iNDIAN CINEMA and the TELANGANA STATE in turn gave him the BIGGEST RETURN GIFT by sending him to JAIL…
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2024
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను అరెస్టు చేసిన సమయంలో రాంగోపాల్ వర్మ స్పందించారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన అధికారులకు నాలుగు ప్రశ్నలు సంధించారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటల్లో ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా..? భద్రత ఏర్పాట్ల అంశం పోలీసులు, ఆర్గనైజర్లదే తప్ప సినిమా హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. సంధ్య థియేటర్ కేసులో శుక్రవారం అల్లు అర్జున్ అరెస్టయ్యారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ పత్రాలు సకాలంలో అందడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ శనివారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు.