Singham Again | రోహిత్ శెట్టి పాపులర్ కాప్ యూనివర్స్ సింగం ప్రాంచైజీలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా సింగం అగెయిన్ (Singham Again). బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ (Ajay devgn) టైటిల్ రోల్లో నటించగా. అక్షయ్ కుమార్, రన్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికాపదుకొనే కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాగా.. మిక్స్ డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది.
కాగా థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ట్విస్ట్‌తో సినిమాను వీక్షించే అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని రూ.499 ధరతో రెంటల్ ఫీ విధానంలో చూడొచ్చు. ఇక ఎవరైతే ఉచితంగా చూడాలనుకుంటున్నారో మరికొన్ని రోజులు ఆగాల్సిందేనన్నమాట.
ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవ్గన్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెరెక్కించాయి. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది చూడాలి.
#SinghamAgain (Hindi) Now Available for Rent on PrimeVideo.#OTT_Trackers pic.twitter.com/M12IRkbCtk
— OTT Trackers (@OTT_Trackers) December 13, 2024
సింగం అగెయిన్ ట్రైలర్..
Satyadev | బ్రతికిపోయాం.. ముఫాసా ది లయన్ కింగ్‌లో టాకాకు సత్యదేవ్ వాయిస్
Coolie | తలైవా బర్త్ డే స్పెషల్.. కూలీ షూట్ లొకేషన్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!