Satyadev | హాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ది లయన్ కింగ్‌కు ప్రీక్వెల్‌గా వస్తోంది ముఫాసా: ది లయన్ కింగ్ (Mufasa The Lion King). అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ కీ రోల్ టాకా (సింహం) పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఓవర్ అందించాడు.
బ్రతికిపోయాం.. మనల్ని కాపాడింది నేనే.. టాకా పాత్రకు వాయిస్ ఓవర్ అందించిన వీడియోను సత్యదేవ్ షేర్ చేశాడు. అంతేకాదు ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకు పనిచేయడం పట్ల తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో షేర్ చేసుకున్నాడు. నాకు లయన్ కింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ సినిమా చూసినప్పుడల్లా.. అందులో ఏదో ఒక పాత్రకు నేను వాయిస్ ఇవ్వాలని అనుకునేవాడిని.
యానిమేషన్ సినిమాకు ఎప్పుడూ వాయిస్ ఇవ్వలేదు. కానీ తొలిసారి ఇచ్చాను. చాలా సంతోషంగా ఉంది.. అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్లో ముఫాసా పాత్రకు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు వాయిస్ అందించాడని తెలిసిందే. హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించాడు.
From watching The Lion King to voicing in it! 🦁
Watch @ActorSatyaDev speaks on his magical experience voicing Taka for the telugu version of #Mufasa ❤️🔥#MufasaTheLionKing in cinemas December 20!
Superstar @urstrulymahesh @DisneyStudiosIN pic.twitter.com/dWJePUbQod
— BA Raju’s Team (@baraju_SuperHit) December 12, 2024
Akhanda 2 | అఖండ 2 వచ్చేది అప్పుడే.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ టీం రిలీజ్ డేట్ ప్రోమో
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్